Share News

ప్రజా సేవలపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:47 PM

ప్రజా సేవలపై నిర్లక్ష్యం వహించొద్దని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ప్రజా సేవలపై నిర్లక్ష్యం వద్దు
అధికారులతో మాట్ల్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రజా సేవలపై నిర్లక్ష్యం వహించొద్దని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మండలంలోని సచివాలయ సిబ్బందితో ప్రజా సేవల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయాలు ప్రజలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధాన ద్వారం అని, ప్రతి సిబ్బంది తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

పనులు సజావుగా కొనసాగించాలి: నేషనల్‌ హైవే 340బీ పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా కొనసాగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి ఆర్‌అండ్‌బీ, ఫారెస్టు, మెగ పవర్‌ గ్రిడ్‌ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ ప్రాజెక్టు, రోడ్ల అభివృద్ధి, విద్యుత సరఫరా వంటి పనులు సమయపాలనతో నాణ్యతతో పూర్తి కావాలన్నారు. ఆర్డీవో నర సింహులు, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎల్‌డీవో నరసింహారెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, సీఐ ఇంతియాజ్‌ బాషా, కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, డీఈ రఘు, ఏఈ సురేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన హరికిషన, ఓంప్రకాష్‌, ఎస్‌ఐ నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:48 PM