Share News

రైతులను కష్టపెట్టొద్దు

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:16 AM

మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు కష్టం, నష్టం కలిగించవద్దని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మార్కెట్‌ యార్డును తనిఖీ చేశారు.

రైతులను కష్టపెట్టొద్దు
మార్కెట్‌ యార్డును పరిశీలిస్తున్న జేసీ నూరుల్‌ కమర్‌

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

కర్నూలు మార్కెట్‌ యార్డు తనిఖీ

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు కష్టం, నష్టం కలిగించవద్దని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు మార్కెట్‌ యార్డును తనిఖీ చేశారు. సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మితో పాటు సిబ్బంది జేసీకి బొకే అందించారు. జేసీ మార్కెట్‌ యార్డులో కలియ తిరిగి, పంట ఉత్పత్తుల అమ్మకాలు, ప్లాట్‌ఫారాలను రైతుల కోసం నిర్వహిస్తున్న భోజన హాల్లఓ డైనింగ్‌ హాలు, వాష్‌రూమ్‌లు, మినిరల్‌ వాటర్‌ ప్లాంటు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. మార్కెట్‌ యార్డును శుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజు చెత్తను తొలగించాలని, తూకాల్లో ఖచ్చితత్వం ఉండాలని, సెక్రటరీతో పాటు సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు నిఘా ఉంచాలని ఆదేశించారు. అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్‌, అకౌంటెంట్‌ కిషన్‌సింగ్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:16 AM