Share News

ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:29 PM

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే పీజీఆర్‌ఎస్‌ సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అధికారులను హెచ్చరించారు.

ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

పీజీఆర్‌ఎస్‌కు 107 ఫిర్యాదులు

నంద్యాల టౌన్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే పీజీఆర్‌ఎస్‌ సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వయంగా స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి 107 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని చట్ట పరిధిలో పరిష్కరించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని తెలిపారు. వాటిలో ఇలా కొన్ని ఫిర్యాదులు... పిన్నాపురం గ్రామానికి చెందిన వె ంకటరాజు తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్నభూమిని తన అన్నదమ్ములు తన అనుమతి లేకుండా చట్ట విరుద్దంగా పంచుకున్నారని తను అన్యాయం జరిగిందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెద్ద దేవళాపురానికి చెందిన రామారావు తన పేరు మీద ఎలాంటి రుణాలు తీసుకోకపోయినా లోన్‌ మొత్తం చెల్లించాలని ఇంటివద్దకు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దులాపురానికి చె ందిన రత్నమ్మ అనే మహిళా తన 47 సెంట్ల భూమిని అక్రమంగా పక్కనే ఉన్న వెంకటరామిరెడ్డి అక్రమించుకుని పోలంలోకి వెళ్లనివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - Dec 15 , 2025 | 11:29 PM