సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు :సీఐ
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:48 PM
సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ జయ న్న సూచించారు.
పత్తికొండ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ జయ న్న సూచించారు. ఆదివారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ప్రజలకు అవగాహన కల్పిం చారు. సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు తెర తీస్తుంటారన్నారు. ఫోన్లకు వచ్చే ఏపికే ఫైల్స్ ప్రమాదమని, వాటని ఓపెన్ చేయొద్దని సూచించారు. ఓపెన్‌చేస్తే ఫోన్‌డేటా నేరగాళ్ల చేతిలోకి వెళుతుందని నగదు కాజేస్తారన్నారు. బాధితులు త్వరగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.