Share News

ఆందోళన వద్దు.. ఉల్లిని కోనుగోలు చేస్తాం

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:58 PM

ఉల్లిని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని ఈదుల దేవరబండ వద్ద గ్రామంలో ఉల్లి రైతులతో మాట్లాడారు.

ఆందోళన వద్దు.. ఉల్లిని కోనుగోలు చేస్తాం
ఈదుల దేవరబండలో ఉల్లి రైతుతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

దేవనకొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉల్లిని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని ఈదుల దేవరబండ వద్ద గ్రామంలో ఉల్లి రైతులతో మాట్లాడారు. ఉల్లిని ఆరబెట్టి, గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తెస్తే కొనుగోలు చేస్తామన్నారు. మనగ్రోమోర్‌ కేంద్రాన్ని తనిఖీ చేసి, యూరియా నిల్వలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేకుండా చుస్తామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. అనంతరం జడ్పీ పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదవి పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రాథమిక వైద్యశాలలో తనిఖీ చేశారు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, కె. వెంకటాపురం గ్రామానికి చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి కలెక్టరు దృష్టికి తీసుకొచ్చారు. 6వ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు.పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ రామాంజినేయులు, డీప్యూటీ ఎంపీడీవో గోపాల్‌, ఏవో ఉషారాణి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మురళిమోహన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శివలింగమ్మ, వైద్యాధికారి విజయభాస్కర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:58 PM