Share News

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:46 AM

సి.క్యాంపు రైతుబజారులో నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తాయ నే ఆశతో ప్రజల వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యావసర వస్తువులు అందించాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజా రఘువీరా అన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
ఉల్లిగడ్డలను పరిశీలిస్తున్న డీఎస్‌వో రాజా రఘువీరా

జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజా రఘువీరా

సిక్యాంపు రైతు బజారులో తనిఖీలు

కర్నూలు అగ్రికల్చర్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): సి.క్యాంపు రైతుబజారులో నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తాయ నే ఆశతో ప్రజల వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యావసర వస్తువులు అందించాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజా రఘువీరా అన్నారు. నగరంలోని సి.క్యాంపు రైతుబజారును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కిరాణ అంగళ్లతోపాటు కూర గాయలు విక్రయిస్తున్న స్టాల్స్‌ను డీఎస్‌వో పరిశీలించారు. ఆయన వెంట సి.క్యాంపు రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి కళ్యాణమ్మ, హార్టిక ల్చర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:47 AM