మత్తుకు బానిస కావొద్దు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:11 AM
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ రామకృష్ణారెడ్డి అన్నారు.
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ‘నషా ముక్త్ భారత అభియాన’లో భాగంగా ప్రభుత్వ టౌన మోడల్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ పద్మావతి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వలన జరిగే నష్టా లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూప రింటెండెంట్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాల వచ్చే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లమ ని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెం డెంట్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజేంద్రప్రసాద్, పట్టణ ఎస్‌ఐ నవీనబాబు, వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.