ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:38 PM
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ సునీల్ షెరాన్ అధికారులను ఆదేశించారు.
నంద్యాల టౌన్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ సునీల్ షెరాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 95 ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదులు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.