ప్రభుత్వ బడికి దాతలు సహకరించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:28 AM
ప్రభుత్వ బడుల అభివృద్ధికి దాతలు సహకరించాలని విశ్రాంత రాయలసీమ ఐజీ ఇక్బాల్ అన్నారు
విశ్రాంత రాయల సీమ ఐజీ, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ బడుల అభివృద్ధికి దాతలు సహకరించాలని విశ్రాంత రాయలసీమ ఐజీ ఇక్బాల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మేకల బజారులో తాను దత్తత తీసుకున్న ఆసియా ఉర్దూ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ పరికరాలు, పుస్తకాలు పంపిణీ చేశారు. తాను ఇక్కడ చదువుకున్నానని, పట్టణానికి చేయూతనివ్వాలని సంకల్పించానన్నారు. ఐజీగా ఉన్న సమయంలో నెహ్రూ మెమోరి యల్ పాఠశాల వంటశాల నిర్మాణం, మైదా నం అభివృద్ధికి కృషి చేశానన్నారు. హెచ్ ఎంలు నూర్ బాషా, అలిమ్ సిద్ధికి, గిరిబాబు, ప్రభుత్వ ఖాజీ అల్తాప్, ఎంఈవో భూపాల్ రెడి, ఉపాధ్యాయులు జుబేర్ కళ్యాణ్ రావు జగన్నాథ్, ఇలియాస్, యూనిస్ పాల్గొన్నారు.