రక్తదానం ప్రాణదానంతో సమానం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:03 AM
రక్తదానం ప్రాణదానంతో సమానమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు అన్నారు.

కర్నూలు హాస్పిటల్, జూన 14(ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానంతో సమానమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలు జీజీహెచలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో హాస్పిటల్ లోని ధన్వంతరీ హాలులో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథులుగా సూపరింటెండెంట్ కె.వెంకటే శ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ, అడిషినల్ డీఎం హెచవో డా.ఎల్.భాస్కర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం రక్తదానం చేసిన వారికి మెమెంటో, శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్స్ డా.కిరణ్ కుమార్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఆలిహైదర్, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.రంగస్వామి పాల్గొన్నారు.