రక్త దానం చేయండి: డీఎస్పీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:29 AM
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అన్నారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అన్నారు. సోమవారం స్థానిక మహాలక్ష్మి ఫంక్షన హాల్‌లో పోలీసు అమర వీరుల వారోత్సవాల సందర్భంగా టౌన సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోగా రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ ప్రమోద్ ప్రారంభించి మాట్లాడారు. పోలీసు అమర వీరుల త్యాగాలు మరవ లేనివన్నారు. ముందుగా డీఎస్పీ ప్రమోద్ రక్త దానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ పట్టణ సీఐ యుగంధర్, సబ్‌డివిజన లోని ఎస్‌ఐలు, పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. రక్త దాన శిబిరాన్ని విజయవంతం చేసిన స్టేట్ రెడ్ క్రాస్ సోసైటీ సిబ్బందికి ఆళ్లగడ్డ పోలీసులు కృతజ్ఞతలు తెలియజేశారు.