అన్నదాతల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా..
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:47 PM
అన్నదాతల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సోమవారం పత్తికొండ పట్టణ శివారులోని ఉల్లి, టమోటా పంటలను పరిశీలించి రైతుల బాధలను అడిగి తెలుసుకు న్నారు.
ఉల్లి, టమాటా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సోమవారం పత్తికొండ పట్టణ శివారులోని ఉల్లి, టమోటా పంటలను పరిశీలించి రైతుల బాధలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఉల్లి పంటను సాగుచేసిన రైతు సుంకన్న మాట్లాడుతూ వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలను సాగుచేస్తే మార్కెట్‌లో ధర లేక తీవ్రంగా నష్టపో యామన్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామ చంద్రయ్యతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో టమోటా, ఉల్లి పంటలను సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీ యంగా మారిందన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని, టమోటాలను పొలాల్లోనే వదిలేసిన పరిస్థితి ఏర్ప డిందన్నారు. ఉల్లికి క్వింటానికి రూ.3వేలు, టమోటా కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ సీఎం చంద్ర బాబునాయుడికి, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నా యుడికి వ్యవసాయ రంగం పట్ల అవగాహన లేదన్నారు. వెల్దుర్తి మండలం కోసానపల్లికి చెందిన ఉల్లి రైతు రామచంద్రకు ఉల్లి పంటకు రూ.3 లక్షల నష్టం రావడంతో మనో వేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడ న్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజ నేయులు, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నబీరసూల్, రాజాసాహెబ్, మం డల కార్యదర్శి కారుమంచి, జిల్లా సమితి సభ్యులు కారన్న, రామాం జనేయులు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
ప్యాపిలి: టమోటా రైతును ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రా మక్రిష్ణ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక టమోటా మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ రైతులతో మాట్లా డారు. మార్కెట్‌లో గత 20 రోజులుగా కిలో టమోటా రూ.4 మించి ధర పలకడం లేదని రైతులు రామక్రిష్ణ ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ నంద్యాల, కర్నూలు కార్యదర్శులు రంగనాయుడు, గిడ్డయ్య, రామాంజి నేయులు, రాధాక్రిష్ణ, గార్లదిన్నె మహేష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.