Share News

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:44 PM

గ్రామాల్లో వైద్యులు, సిబ్బంది సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎండీహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు.

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో వెంకటరమణ

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

బండిఆత్మకూరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వైద్యులు, సిబ్బంది సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎండీహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు. శనివారం మండలంలోని కడమలకాల్వ గ్రామంలో ఆయన పర్యటించారు. వీధుల్లో ఉన్న మురుగు ఆవాసాలను, జ్వర పీడితులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లో రికార్డులను తనిఖీ చేశారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో జ్వరాలు, వాంతులు, విరేచనాలు అధికం అవుతాయని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రోజు గ్రామంలో ఇంటింటా తిరిగి ఆరోగ్య క్షేమ సమాచారం సిబ్బంది తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్‌, డాక్టర్‌ దినే్‌షబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:44 PM