Share News

ప్రాణం పోసిన వైద్యులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:31 AM

అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ రోగికి కర్నూలు జీజీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు ప్రాణం పోశారు. కదిరికి చెందిన 54 ఏళ్ల ఏసన్న గుండెలో మూడు వాల్వ్‌లు బ్లాక్‌ కావడంతో సెప్టెంబరులో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు.

ప్రాణం పోసిన వైద్యులు
రోగితో డాక్టర్‌ మంజులాబాయి, వైద్యులు

కర్నూలు జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ రోగికి కర్నూలు జీజీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు ప్రాణం పోశారు. కదిరికి చెందిన 54 ఏళ్ల ఏసన్న గుండెలో మూడు వాల్వ్‌లు బ్లాక్‌ కావడంతో సెప్టెంబరులో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కుట్లు వేసిన చోట రక్తం, చీము కారడంతో మళ్లీ ఆపరేషన్‌ చేయించుకున్న ప్రైవేటు ఆసుప త్రికి వెళ్లగా బెంగుళూరుకు రెఫర్‌ చేశారు. బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అడ్మిట్‌ కాగా రూ.10 లక్షలు ఖర్చు అయింది. అయిన ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడం ఓ వైద్యుని సూచనల మేరకు గత నెల 29వ తేదీన రోగిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి తీసుకుని వచ్చారు. హెచ్‌వోడీ డా.మంజులాబాయి రోగిని పరీక్షించి అడ్మిషన్‌ చేసుకుని ఈ కేసును చాలేంజ్‌గా తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన ప్లాస్టిక్‌ సర్జరీ హెచ్‌వోడీ డా.మంజులాబాయి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.గంగాభావని, అసిస్టెంట్‌ ప్రొఫె సర్లు డా.సింధూ ప్రియాంక, డా.విజయ చంద్రమౌలి బృంధం క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు. వారం రోజులకు ఇన్‌ఫెక్షన్‌ తగ్గడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. గురు వారం సర్జరీ వివరాలను డా. మంజులాబాయి వివరించారు.

Updated Date - Nov 21 , 2025 | 12:31 AM