డాక్టర్ల ప్రీమియం లీగ్ ప్రారంభం
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:08 AM
కర్నూలులో డాక్టర్స్ ప్రీమియం లీగ్ ప్రారంభమైంది. కేఎంసీ అల్యూమి టీం, ఆర్థోపెడిక్ బ్లాస్టర్స్, కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ మరియు పీడీయాట్రిక్ ఫాంథర్స్ జట్లు పాల్గొన్నాయి. రాయల స్టోర్స్ మైదానంలో పోటీలను సుశీల నేత్రాలయ అధినేత డా.సుధాకర్‌రావు ప్రారంభించారు.
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో డాక్టర్స్ ప్రీమియం లీగ్ ప్రారంభమైంది. కేఎంసీ అల్యూమి టీం, ఆర్థోపెడిక్ బ్లాస్టర్స్, కర్నూలు డెంటల్ స్ర్టెకర్స్ మరియు పీడీయాట్రిక్ ఫాంథర్స్ జట్లు పాల్గొన్నాయి. రాయల స్టోర్స్ మైదానంలో పోటీలను సుశీల నేత్రాలయ అధినేత డా.సుధాకర్‌రావు ప్రారంభించారు.
18 పరుగులతో కేఎంసీ అల్యూమి విజయం
మొదటి క్రికెట్ మ్యాచ్ కేఎంసీ అల్యూమి, డెంటల్ స్ర్టెకర్స్ జట్ల మధ్య జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన కేఎంసీ అల్యూమి జట్టు 20 ఓవర్లలో 170 రన్స్ చేయగా, వరుణ్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు సాదించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెంటల్ స్ర్టెకర్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. సుభాష్ 59 పరుగులు సాధించారు. కాగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రీతమ్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫైనల్ నవంబరు 16న ఉంటుంందని నిర్వాహకులు తెలిపారు.