వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 24 , 2025 | 12:28 AM
కొవిడ్ వైరస్‌పై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు ఆదేశించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, మే 23 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ వైరస్‌పై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం కడప రిమ్స్ హాస్పిటల్‌లో నంద్యాల జిల్లాకు చెందిన ఓవ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో కర్నూలు జీజీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ఆదేశాల మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు తన చాంబరులో కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొవడానికి అనుసరించాల్సిన ప్రోటోకాల్‌పై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్‌ఆర్‌ఎంవో డా.బీవీ రావు, ఫల్మనాలజీ, అనస్థీషియా, మెడిసిన్, పీడీయాట్రిక్, ఎమర్జెన్సీ, మెడిసిన్, మైక్రోబయాలజీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు, యాంటి వైరల్ డ్రగ్స్ అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా డ్రగ్స్ స్టోర్ మెడికల్ ఆఫీసర్ డా. శారదను ఆదేశించారు. ఆక్సిజన్‌ను రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అనస్థీషియా వైద్యులకు సూచించారు. వైద్యులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను సిద్దం చేసుకోవాలని సంబంధిత హెచ్‌వో డీలను ఆదేశించారు. పాత గైనిక్ వార్డులో కొవిడ్ ఐసోలేషన్ వార్డును సిద్దం చేయాలని అనస్థీషియా ప్రొఫెసర్ డా. సుధీర్‌ను ఆదేశించారు. సమీక్షలో జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డా. ఇక్బాల్ హుశేన్, అనస్థీషియా హెచ్‌వోడీ డా. విశాల, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డా.నాగలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. విజయలక్ష్మి, ఎమర్జెన్సీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సుబ్రహ్మణ్యం, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.