Share News

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:02 AM

గ్రామాల అభివృద్ధికి ఉదోయగులు కృషి చేయాలని పత్తికొండ డీఎల్‌పీవో రామచంద్రారెడ్డి సూచించారు. బుధవారం మనేకుర్తి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
సమస్యలను తెలుసుకుంటున్న డీఎల్‌పీవో

డీఎల్‌పీవో రామచంద్రారెడ్డి

ఆలూరు రూరల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి ఉదోయగులు కృషి చేయాలని పత్తికొండ డీఎల్‌పీవో రామచంద్రారెడ్డి సూచించారు. బుధవారం మనేకుర్తి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యాదర్శులతో మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్‌ సర్వే కింద మనేకుర్తి, కమ్మరచేడు, తుంబలబీడు, అరికేర, కురువళ్లి, కొట్టాల గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కంఠం భూముల సర్వే ఫైలట్‌ ప్రాజెక్టు కింద 5 గ్రామాలు ఎంపికయ్యా యన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఎంపీడీవో మద్దిలేటిస్వామి, సర్పంచ్‌ కొల్లమ్మ, కార్యదర్శి నిఖిల్‌మోదీ, టీడీపీ నాయకులు దేవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 01:02 AM