న్యాయం చేస్తాం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:01 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 99 సమస్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు వచ్చాయి.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సీ.క్యాంపు చెందిన రాఘ వరెడ్డి రూ.1లక్ష తీసుకుని మోసం చేశాడని తా డిపత్రికి చెందిన నరసింహులు ఫిర్యాదు చేశారు.
నవీన్‌కుమార్ అనే వ్యక్తి వీసా ఇప్పి స్తా మని చెప్పి రూ.30వేలు తీసుకుని మోసం చేశా డని లక్ష్మీనగర్‌కు చెందిన సాదిక్ ఫిర్యాదు చేశారు.
శంకర్ అనే వ్యక్తి కర్నూలు పాతబస్టాండు దగ్గర దీపక్ లక్కీగోల్డ్ స్కీం పేరుతో డబ్బు కట్టిం చుకొని మోసం చేసి వెళ్లిపోయాడని కర్నూలు సీ.క్యాంపు చెందిన లక్ష్మి ఫిర్యాదు చేశారు.
మూడో కుమార్తె ధనలక్ష్మి తన ఇంటిని ఆక్ర మించుకోవాలని బయటకు పంపించిందని, కర్నూలు చెందిన నరసమ్మ ఫిర్యాదు చేశారు.