Share News

ఉల్లి అమ్మకాలు త్వరగా జరపండి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:41 AM

రైతుల నుంచి ఉల్లిగడ్డలను క్వింటానికి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేసి అమ్మకాల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

ఉల్లి అమ్మకాలు త్వరగా జరపండి
ఉల్లిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

వ్యాపారుల కొనుగోళ్లపై నిఘా పెట్టండి

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ఉల్లిగడ్డలను క్వింటానికి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేసి అమ్మకాల కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పంపేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు ఈ విషయంలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. శనివారం కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల నుంచి మార్క్‌ఫెడ్‌ అధికారులు కొనుగోలు చేస్తున్న ఉల్లిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు మాట్లాడుతూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపడంతో పాటు స్థానికంగా హోల్‌సేల్‌ వ్యాపారులు, డీలర్లు, విద్యాసంస్థలు, హాస్టళ్ల యజమానులకు విక్రయిస్తున్నట్లు వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పూర్తిగా పక్వానికి వచ్చిన ఉల్లిని మార్కెట్‌ యార్డుకు తీసుకురావాలని సూచించారు. జేడీ రామాంజనేయులు, డీడీ ఉపేంద్ర, ఏడీఎంలు సత్యనారాయణ చౌదరి, నారాయణమూర్తి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి, చైర్‌పర్సన్‌ అజ్మిత్‌ బీ. వైస్‌ చైర్మన్‌ శేషగిరిశెట్టి, సెక్రటరీలు వెంకటేశ్వర్లు, సుందర్‌రాజు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నగేష్‌, శివన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:42 AM