Share News

హోటళ్లలో కృతిమ రంగులు వినియోగించొద్దు

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:13 AM

నంద్యాల జిల్లాలోని అన్ని హోటళ్లలో కృతిమ రంగులు, టెస్టింగ్‌ సాల్ట్‌ వినియోగిం చొద్దని నంద్యాల జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటరాముడు హోటల్‌ యజమానులను హెచ్చరించారు.

హోటళ్లలో కృతిమ రంగులు వినియోగించొద్దు
హోటల్‌లో తనిఖీలు నిర్వ హిస్తున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటరాముడు

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని అన్ని హోటళ్లలో కృతిమ రంగులు, టెస్టింగ్‌ సాల్ట్‌ వినియోగిం చొద్దని నంద్యాల జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటరాముడు హోటల్‌ యజమానులను హెచ్చరించారు. నంద్యాల జిల్లాలో జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ ఆదేశాల మేరకు గురువారం నంద్యాల పట్టణంలో పలు రెస్టారెంట్లు, హోటళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా అక్కడ పనిచేసే కార్మికులకు హోటళ్లలో ఆహార పదాఽర్ధాలు ఎలా తయారు చేయాలి? ఎలా వినియోగించాలి? అనే విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం పట్టణంలోని కెఎప్సీ, మాఊరు విందు, కిచెన్‌గార్డెన్‌, రెడ్‌ బకెట్‌, నాయుడుగారి బిర్యానీ హోటల్స్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఫుడ్‌ సేఫ్టీ అధికారి కాశీంవలి, కన్జూమర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సయ్యద్‌ అమీర్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:13 AM