అనధికార లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:26 AM
అనధికారిక లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని కుడా అధ్యక్షు డు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
కుడా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
నంద్యాల ఎడ్యుకేషన, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అనధికారిక లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని కుడా అధ్యక్షు డు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్ట రేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో మంగళవారం పలు పథకాలపై ఉద్యోగులకు నిర్వహించిన అవగా హనా సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అనధికారిక లే అవుట్‌లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని పొడిగిస్తూ సవరణ ఉత్తర్వులు తీసుకువచ్చిం దన్నారు. 31-12-2020 నాటికి దరఖాస్తు చేసుకోలేని ప్లాట్ యజమా నులకు ప్రయోజనం కల్గించేలా 30-06-2025 కంటే ముందు వేసిన అనధికారిక లే అవుట్‌లలో రిజిష్టర్ అయిన అనధికారిక ప్లాట్లను ప్రణా ళికాబద్ధంగా తీసుకు రావడానికి ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని కొనసాగిసు ్తన్నామన్నారు. గ్రామ పంచాయతీల్లోని అనధికారిక లే అవుట్‌లను ఎల్ ఆర్‌ఎస్ స్కీము ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాల న్నారు. సమావేశంలో ప్లానింగ్ అధికారులు మోహనకుమార్, విజయ భాస్కర్, సహాయ ప్లానింగ్ అధికారి శశికళ పాల్గొన్నారు.