Share News

ఆక్రమణలకు తావివ్వొద్దు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:33 PM

సోలార్‌ పరిశ్రమలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తావివ్వకూడదని జాయింట్‌ కలెక్టరు విష్ణు చరణ్‌ ఆదేశించారు.

ఆక్రమణలకు తావివ్వొద్దు
కందికాయపల్లి సోలార్‌ భూముల రికార్డును పరిశీలిస్తున్న జేసీ విష్ణుచరణ్‌

సోలార్‌ భూములను పరిశీలించిన జేసీ

పాణ్యం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సోలార్‌ పరిశ్రమలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ భూముల ఆక్రమణలకు తావివ్వకూడదని జాయింట్‌ కలెక్టరు విష్ణు చరణ్‌ ఆదేశించారు. కందికాయ ు పల్లిలోని సోలార్‌ భూములను శుక్రవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించి గతంలో కేటాయించిన భూముల వివరాలను తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తహసీల్దారు, వీఆర్వో, సర్వేయర్లకు సూచించారు. సర్వే నెంబర్ల వారిగా కేటాయించిన భూముల మ్యాపులను పరిశీలించి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్‌, ఆర్‌ఐ రాము, వీఆర్వో సిద్ధయ్య, సర్వేయర్‌ నాగరాజు ఉన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:33 PM