Share News

బాధితులకు న్యాయం చేయండి

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:59 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారు లను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.

బాధితులకు న్యాయం చేయండి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారు లను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 83 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ అడ్మిన్‌ హుశేన్‌పీరా, సీఐలు పాల్గొన్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని...

కర్నూలులో ఇంటింటి సర్వే చేయించే ఉద్యోగాలు ఇప్పిస్తామని నెలకు రూ.26వేలు జీతం, అని చెప్పి రవి, ధనుంజయ్‌ తమ ఇద్దరి నుంచి రూ.3లక్షలు తీసుకుని మోసం చేశారని సీతారామ్‌నగర్‌ చెందిన టి.గురు, పవన్‌, భరత్‌, గురు కిషోర్‌ వర్మ ఫిర్యాదు చేశారు. ఇంటర్‌ చదివిన తమ అమ్మాయికి, అబ్బాయికి కర్నూలు కలెక్టరేట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫరూక్‌ అనే వ్యక్తి రూ.2.26 లక్షలు తీసుకుని మోసగించాడని అరుంధతినగర్‌కు చెందిన డి. ఉమాబాయి ఫిర్యాదు చేశారు. కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హైదరాబాదు చెందిన అభిలాష్‌ రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశారని బుధవారపేటకు చెందిన అభిలేష్‌ పిర్యాదు చేశారు.

Updated Date - Jun 02 , 2025 | 11:59 PM