న్యాయం చేయాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:17 AM
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయామని, న్యాయం చేయాలని బాధితులు కోరారు. సోమవారం పత్తికొండలో ఆర్డీవో భరత్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు
రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయాం
పత్తికొండ ఆర్డీవోకు బాధితుల మొర
పత్తికొండ టౌన్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయామని, న్యాయం చేయాలని బాధితులు కోరారు. సోమవారం పత్తికొండలో ఆర్డీవో భరత్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలోని ఆర్.ఎస్.పెండేకల్ గ్రామంలో 2016లో సర్వే నెంబర్ 509బీ1, 509బీ2లో 1.02 ఎకరాల స్థలంలో వెంచర్ వేసి ఎద్దులదొడ్డి రామచంద్రుడు ప్రచారం చేసుకున్నారని, దీంతో చుట్టుపక్కల గ్రామాలైన ఇందిరంపల్లి, చందోలి, పెద్దపూజల్ల తదితర గ్రామాలకు చెందిన 19 మంది ఒక్కొక్కరు రూ.90 వేలు వెచ్చించి 2 సెంట్లు ప్రకారం స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే నంబర్ పరిధిలోని భూమి రైల్వేశాఖ పరిధిలోకి వెళ్లిపోయిందని అధికారులు చెబుతున్నారని, దీనిపై వ్యాపారిని నిలదీస్తే చేతులెత్తేశాడని చెప్పారు.
2016లో రూ.90 వేలతో రెండు సెంట్ల స్థలం కొన్నా
ఆర్.ఎస్.పెండేకల్‌లో 2016లో రూ.90 వేలు వెచ్చించి 2 సెంట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా కొనుగోలు చేశా. స్థలానికి రిజిస్ర్టేషన్ కూడా చేయించుకున్నా. స్థలం కోసం వెళ్తే మీ స్థలం లేదంటూ రైల్వేశాఖ అధికారులు చెప్పారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. - కృష్ణ, బాధితుడు, పెద్దపూజర్ల
వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి
మాకు మాయ మాటలు చెప్పి స్థలాలను అమ్మి మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపా రిపై చర్యలు తీసుకోవాలి. మాకు అమ్మిన స్థలానికి ఆన్‌లైన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు ఉండడంతో రైల్వేశాఖ ఇచ్చిన నష్టపరి హారం వ్యాపారి అకౌంట్‌లో జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాపారి మాకు స్థలమైనా చూపించాలి. డబ్బులైనా తిరిగి ఇవ్వాలి.- సుధాకర్, బాధితుడు, ఇందిరాంపల్లి