మావోయిస్టులతో చర్చలు జరపాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:25 PM
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు.
అరుణోదయ తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క
కర్నూలు న్యూసిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. గురువారం స్థానిక ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయం వద్ద నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పాటల సీడీని ఆమె ఆవిష్కరించారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడి నేలరాలిన ఎందరో అమరవీరులకు విప్లవ జోహార్లు ఆర్పిస్తూ నవంబర్ మాసమంతా ఊరురా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ పేరుతో అడవులపె,ౖ ఆదివాసులపై మిలటరీ, పారా మిలిటరీ, డీఆర్జీ బలగాలతో అడవులను ముట్టడించి మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే ఆపరేషన్‌ను నిలిపివేసి విప్లవకారులతో శాంతి చర్చలు జరపాలని ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీంబాషా, డీటీఎఫ్ నాయకుడు రత్నం ఏసేబు, కేఎన్‌పీఎ్‌స నాయకుడు సుబ్బారాయుడు, విప్లవ కళాకారుడు పోతన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకుడు శేషఫణి పాల్గొన్నారు.