ఉత్తమ వైద్యసేవలు అందించండి
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:22 AM
పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం ఉదయం జీజీహెచ్, మెడికల్ కాలేజీ అభివృద్ది సమావేశాన్ని కేఎంసీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు
పరీక్షల కోసం రోగులను బయటకు పంపకూడదు
కేఎంసీ సమీక్షా సమావేశంలో మంత్రి టీజీ భరత్
కర్నూలు హాస్పిటల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం ఉదయం జీజీహెచ్, మెడికల్ కాలేజీ అభివృద్ది సమావేశాన్ని కేఎంసీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూరోగులను మందులు, పరీక్షలకు బయటకు పంపవద్దని సూచించారు. నెక్ట్స్‌జెన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుని పేపర్‌లెస్ సేవలు అందించాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు 70 మంది మాత్రమే ఉన్నారనీ, 249మంది అవసరమని డీఎంఈకి ప్రతిపాదనలు పంపామన్నారు. మంత్రి మాట్లాడుతూ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.20 కోట్లు, విశ్రమ్ సదన్ కోసం తలపెట్టిన రోగుల సహాయకుల షేడ్, ఐసీయూలో ఎయిర్స్ కండీషన్, అనస్థీషియా వర్క్‌స్టేషన్ ఏర్పాటు, రోస్టర్ పాయింట్లు ప్రకారం చేస్తున్న పోస్టులు వివరాల నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో అన్ని పరీక్షలు అందుబాటులో ఉండగా.. బయట ఉన్న రాయలసీమ ల్యాబ్‌కు రోగులను పంపడం కరెక్టు కాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై హెచ్‌డీఎస్ సభ్యుడు టి.సాయిప్రదీప్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో దొంగతనాలు జరుగుతున్నాయనీ సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పనిచేయడంలేదని సెక్యూరిటీ గార్డులను పూర్తిస్థాయిలో నియమించలేదని సూపరింటెం డెంట్ తప్ప ఎవరూ గదులను దాటి తనిఖీ చేయడం లేదని మంత్రికి పిర్యాదు చేశారు. కొందరు పీజీలు కమీన్లకు కక్కుర్తి పడి రాయలసీమ డయోగ్నస్టిక్ ల్యాబ్‌కు చిన్న చిన్న టెస్టులను పంపుతున్నారనీ, ఒక్కొక్క వైద్య విద్యార్థికి రూ.30వేల వరక కమీషన్ వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇకపై ఒక్క పరీక్షను కూడా బయటకు పూంపకూడదని మంత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిం చారు. ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినర సమ్మ, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.కృష్ణ ప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి సుధీర్, హెచ్‌డీఎస్ సభ్యులు డా.ప్రవీణ్, రఘునాథరెడ్డి, జగదీష్, సాయిప్రదీప్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.