మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:28 PM
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశించారు. శనివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, శుభ్రత, రోగుల అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సేవలపై డాక్టర్ నాగరాజును అడిగి తెలుసుకు న్నారు.
కోడుమూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశించారు. శనివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, శుభ్రత, రోగుల అందిస్తున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సేవలపై డాక్టర్ నాగరాజును అడిగి తెలుసుకు న్నారు. అనంతరం రోగులను పలకరించి, వారికి అందు తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొన్నారు. సీజనల్ వ్యాధులు టైఫాయిడ్, మలేరియా ప్రబలుతున్నాయని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గుండె జబ్బుల రోగులకు ప్రథమ చికిత్సలో భాగంగా రూ.45వేల ఇంజెక్షన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. బాధితులు గమనించి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి రావాలన్నారు. అనంతరం జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ పాటించాలని, శుచితో రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసి, గతంలో ఇద్దరు విద్యార్థులపై దాడి ఘటన బాధాకరమని, పునరావృతం కాకుండా చూడాలని వార్డెన్‌ను ఆదేశించారు. ఇకపై ప్రభుత్వం అధికారుల పని తీరుపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాద్యత
కర్నూలు రూరల్: పరిసరాల పరిఽశుభ్రత మన బాధ్యత అని కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి పేర్కొన్నారు. శనివారం పసుపుల గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్చ ఆంధ్రలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్‌రెడ్డి, సర్పంచ్ బొగ్గుల శీలమ్మ పాల్గొన్నారు.