Share News

రాఘవేంద్రుని సన్నిధిలో జిల్లా న్యాయాధికారి

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:37 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని కర్నూలు జిల్లా న్యాయాధికారి కబర్దీ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో జిల్లా న్యాయాధికారి
మంచాలమ్మకు పూజలు చేస్తున్న కర్నూలు జిల్లా న్యాయాధికారి

మంత్రాలయం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని కర్నూలు జిల్లా న్యాయాధికారి కబర్దీ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామిదర్శనార్థం వచ్చిన న్యాయాధికారిని మహముఖ ద్వారం వద్ద మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంటేష్‌ జోషి, సురేష్‌ కోనాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహామూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాంక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట అనంతపురాణిక్‌, ఎస్‌ఐ శివాంజల్‌, అనంతస్వామి, ప్రకాశ్‌ ఆచార్‌, పవన్‌ఆచార్‌, వ్యాసరాజార్‌, జయతీర్థ ఆచార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:37 PM