Share News

సక్రమంగా రేషన్‌ పంపిణీ చేయండి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:04 AM

రేషన్‌ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పింపిణీ చేయాలని రేషన్‌ డీలర్‌లను కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు.

 సక్రమంగా రేషన్‌ పంపిణీ చేయండి
హొళగుందలో రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్‌ : కలెక్టర్‌ సిరి

హొళగుంద, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పింపిణీ చేయాలని రేషన్‌ డీలర్‌లను కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ చౌక ధరల దుకాణం 04 కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రేషన్‌ సరుకుల పంపిణీ ప్రక్రియ, స్టాక్‌ వివరాలు, ఈ- పాస్‌ యంత్రాల వినియోగం, కార్డుదారుల హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం 65 ఏళ్ల సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హోమ్‌ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ డా ఏ. సిరికి ప్రజలు అనేక సమస్యలు వినిపించాయి. సామూహిక మరుగుదొడ్డిని కొందరు వైసీపీ నాయకులు కూల్చివేశారని కలెక్టర్‌ వాహనానికి అడ్డుగా బైఠాయించారు. ఎస్సై దిలీప్‌ కుమార్‌ జోక్యంతో వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ప్రత్యామ్నాయం చూస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. బుడగ జంగాల కాలానికి చెందిన రామాంజినేయులు తమ కాలనీలో 11కేవీ విద్యుత్‌ తీగలు ఇళ్లపై వెళ్లడంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ జరిగి గుడిసెలు అగ్ని ప్రమాదం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సౌరసరఫరా శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ (ఇన్‌చార్జి) అజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ నిజాముద్దీన్‌, ఎంపీడీవో విజయ లలిత, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:04 AM