రీ వాల్యుయేషన్‌లో వివాదం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:31 AM
సీఎంవో పేషీ పేరుతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి రాయలసీమ యూనివర్సిటీలో చేస్తున్న కొందరు ప్రొఫెసర్లు జీర్ణించుకోలేక ఆందోళన పరీక్షల ఫలితాలు దేశమంతా ఆన్‌లైన్ ప్రక్రియ సాగుతుండగా.. రాయలసీమ వర్సిటీలోని కొందరు ఆ ప్రక్రియను కూడా తమ చేతుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఆర్‌యూలో కాంట్రాక్టు ఉద్యోగి పెత్తనం
ఆందోళనలో ప్రొఫెసర్లు, ఉద్యోగులు
విద్యార్ధి నేతల చేతుల్లోకి వర్సిటీ కీలక ఫైళ్లు
కర్నూలు అర్బన్ , అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎంవో పేషీ పేరుతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి రాయలసీమ యూనివర్సిటీలో చేస్తున్న కొందరు ప్రొఫెసర్లు జీర్ణించుకోలేక ఆందోళన పరీక్షల ఫలితాలు దేశమంతా ఆన్‌లైన్ ప్రక్రియ సాగుతుండగా.. రాయలసీమ వర్సిటీలోని కొందరు ఆ ప్రక్రియను కూడా తమ చేతుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా బుధవారం బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ 86 శాతం ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసింది. పరీక్షల విభాగం కంట్రోలర్‌ను కట్టడి చేసే క్రమంలో ఫలితాల విడుదల ప్రక్రియ అంతా ఓ ఇన్‌చార్జి అధికారి చేతుల్లోకి వెళ్లిందని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగి, ఇన్‌చార్జి అధికారి రీ వాల్యుయేషన్ ఫీజు మొదటిసారిగా రూ.300 నుంచి రూ.550కు పెంచడంతో వర్శిటీకి రూ.పది లక్షల ఆదాయం సమకూర్చామని ఉపకులపతిని పక్కదారి పట్టించారనే ప్రచారం జరుగుతోంది. తెరవెనుక కళాశాలల యాజమాన్యాలతో లోపాయికారీ ఒప్పందంతో విద్యార్థులను పాస్ చేయించుకున్నారనే ప్రచారం క్యాంపస్‌లో చక్కర్లు కొడుతోంది. మే నెలలో జరిగిన బీఈడీ పరీక్షల్లో చాలా మందిని కావాలనే ఫెయిల్ చేశారా? అనే సందేహంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 1098 మంది రీవాల్యుయే షన్‌కు దరఖాస్తు చేసుకోగా 955 మంది ఉత్తీర్ణులు కావడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూని వర్సిటీలో ఉద్యోగుల నియామక డాక్యుమెంట్లు బైటికి వెళుతున్నా యని, వాటిని విద్యార్థి నాయకులకు అందించి, ఉపకులపతి ద్వారా చర్యలకు వీరే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ నియామక పత్రం బయటకు ఎలా వెళ్లిందని పరిపాలన అధికారి వద్ద ఉద్యోగులు ప్రస్తావించగా సదరు అధికారి హేళనగా మాట్లాడటం అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.
రీ వాల్యుయేషన్‌లో ఉత్తీర్ణతపై అనుమానాలున్నాయి
బీఈడీ 3వ సెమిస్టర్ రీవాల్యుయేషన్‌లో ఒక్కసారిగా 995 మంది ఉత్తీర్ణత సాధించడం అనుమానంగా ఉంది. కావాలనే ఫెయిల్ చేసి అటు బీఈడీ కళాశాలల యాజమాన్యాలతో కొందరు కోటరి ఉద్యోగులు వసూళ్ల పర్వానికి తెగబడ్డరనే ప్రచారం ఉంది. ఈ విషయంలో నిగ్గు తేలే వరకు పోరాటం చేస్తాం. ఓ కాంట్రాక్టు ఉద్యోగి తరచూ సీఎం పేషీ పేరు చెప్పుకొని దోపిడీ చేస్తున్నాడని వినికిడి. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలకు దిగుతాం. ఇకనైన ఉపకులపతి స్పందించి వర్శిటీని గాడిలో పెట్టాలి. - ఎస్. శరత్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్
విషయం నా దృష్టికి వచ్చింది
ఉద్యోగుల నియామకాల హార్డు కాపీలు బయటకు వెళ్లడం సరికాదు. ఇది ఎలా జరిగిందో విచారించి చర్యలు తీసుకుంటా. పరీక్షల విభాగంలో అంతా అన్ లైన్ పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నాం. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తా. - వి. వెంకట బసవరావు, ఉపకులపతి ఆర్‌యూ