Share News

చెరువు మరమ్మతులపై సీఎంతో మాట్లాడతా

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:48 AM

బసాపురం చెరువుకు శాశ్వత మరమ్మతులు చేసేందుకు రూ.70 కోట్ల నిధుల మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఎమ్యెల్సీ బీటీ నాయుడు అన్నారు. సోమవారం చైర్‌పర్సన్‌ లోకేశ్వరి, కమిషనర్‌ కృష్ణతో కలిసి చెరువుకు ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించారు. మరమ్మతుల వివరాలను డీఈ వెంకట చలపతి వివరిం చారు

చెరువు మరమ్మతులపై సీఎంతో మాట్లాడతా
చెరువు పగుళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు

చెరువును పరిశీలించిన ఎమ్మెల్సీ బీటీ నాయుడు

ఆదోని టౌన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): బసాపురం చెరువుకు శాశ్వత మరమ్మతులు చేసేందుకు రూ.70 కోట్ల నిధుల మంజూరు చేయాలని సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఎమ్యెల్సీ బీటీ నాయుడు అన్నారు. సోమవారం చైర్‌పర్సన్‌ లోకేశ్వరి, కమిషనర్‌ కృష్ణతో కలిసి చెరువుకు ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించారు. మరమ్మతుల వివరాలను డీఈ వెంకట చలపతి వివరిం చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెలలో కర్నూలుకు వస్తున్న జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లానన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్బంగా ఎమ్మెల్యే డా.పార్థసారథితో కలిసి సీఎంకు వివరిస్తామన్నారు. డీఈ రామమూర్తి ఉన్నారు

మూడు దశాబ్దాల చంద్రన్న యాత్ర

ఆదోని: సీఎం చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా పనిచే మూడు దశాబ్దాల యాత్ర చేసినట్లు ఎమ్మెల్సీ బి.టి.నాయుడు పేర్కొన్నారు. సోమవారం మాట్లాడుతూ చంద్రబాబు పాలన రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన నాయకుడన్నారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి ఆయన కృషి అమూల్యమన్నారు. హైటెక్‌ సిటీ నిర్మాణం విజన్‌ 2020 నాలెడ్జ్‌ ఎకనామీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ మ్యాప్‌పై నిలిపారన్నారు. ఉపాధ్యాయుల నియామకం, విద్య, వైద్య రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేశారన్నారు. నదుల అనుసంధానం, అన్నా క్యాటీన్లు, రియల్‌ టైం గవర్నెన్స్‌, అమరావతి నిర్మాణం నిర్ణయాలు ఆయన ఆలోచనలకు ప్రతిబింబించాయన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:48 AM