‘సుపరిపాలన తొలి అడుగు’లో భగ్గుమన్న విభేదాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:09 AM
‘సుపరిపాలన తొలి అడుగు’లో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
టీడీపీలో గ్రూపు రాజకీయాలు
కోడుమూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘సుపరిపాలన తొలి అడుగు’లో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పట్టణం లోని ఇరిగేషన్ విశ్రాంతి భవనంలో బుధవారం ‘సుపరిపాలన తొలి అడుగు’ నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ రామక్రిష్ణారెడ్డి, పట్ట ణాధ్యక్షుడు గంగాధర్‌నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం కొన సాగింది. దీంతో టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బహిర్గతమ య్యాయి. పార్టీలోని కొంత మంది సీనియర్ కార్యకర్తలు గ్రూపు రాజకీయాలు చేస్తూ, వైసీపీ నాయకులకు పనులు చేస్తున్నారని టీడీపీకి చెందిన బలరాం ఆరోపించారు. పార్టీలో ఒక గ్రూపునకు మాత్రమే పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వచ్చి ఏడా ది గడిచినప్పటికి పట్టణంలో ఎక్కడి సమస్య అక్కడే ఉన్నాయని, ఈ సమయంలో తొలి అడుగు అని ప్రజల ఇళ్ల వద్దకు ఎలా వెళ్లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పార్టీ పెద్దలు డి.విష్ణువర్థన్‌రెడ్డి చెప్పుకోవాలని ప్రయత్నిస్తే కొంతమంది అడ్డు పడుతు న్నారని తన బాధను వ్యక్త పరిచారు. వైసీపీకి చెందిన కొందరిని బూత్ ఇన్‌చార్జ్‌లుగా నియమించడం చాలా దారుణమని పార్టీ సీనియర్ కార్యకర్త గోపాల్‌నాయుడు ప్రశ్నించారు. దీంతో పార్టీలోని కొంతమంది గ్రూపులుగా విడిపోయి ప్రజలు చూస్తుండగానే ఒకరిపై ఒకరు ఆరోణలకు దిగారు. దీంతో సమావేశంలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని మం డల కన్వీనర్ రామక్రిష్ణారెడ్డి ఇరు గ్రూపులను శాంతింపజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గోరంట్ల సర్పంచు బాలక్రిష్ణ, బడెసాగౌడ్, అయ్యప్ప, ఇంతియాజ్, కేఈ రఘుబాబు, ఎల్లప్పనాయుడు, చంద్రమౌళి, బ్రిటీష్ రాముడు పాల్గొన్నారు.