వైకల్యం శరీరానికే.. సంకల్పానికి కాదు
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:49 AM
అంగవైకల్యం శరీరానికేనని, మనుషుల సంకల్పానికి కాదని ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్ ఓల్డ్ ఏజ్, ట్రాన్స్‌జెండర్ కమిటీ చైర్మన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అంగవైకల్యం శరీరానికేనని, మనుషుల సంకల్పానికి కాదని ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిజేబుల్ ఓల్డ్ ఏజ్, ట్రాన్స్‌జెండర్ కమిటీ చైర్మన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చే పింఛన్ రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచిందన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు దైర్యంగా, ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు 2016 చట్టంలో 21 డిజెబిలిటీ అంశాలు, ఇందులోని 12వ క్లాజ్ ప్రకారం అందరికీ సమన్యాయం అందుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి రయీస్ ఫాతిమా, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, మెఫ్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.