రైల్వే గేట్ పడితే నరకం
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:12 AM
పట్టణంలోని డీఎస్పీ బంగ్లా నుంచి ఆర్‌ఆర్ లేబర్ కాలనీ, రాజసాబ్ బంగ్లా వెళ్లే దారిలో రైల్వే గేటు ఉంది. అయితే ఈ మార్గంలో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి
వందల సంఖ్యలో వాహనాలు..
ఆదోని అగ్రికల్చర్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని డీఎస్పీ బంగ్లా నుంచి ఆర్‌ఆర్ లేబర్ కాలనీ, రాజసాబ్ బంగ్లా వెళ్లే దారిలో రైల్వే గేటు ఉంది. అయితే ఈ మార్గంలో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గేటు పడిందం టే చాలు, భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ పెరగడంతో డీఎస్పీ బంగ్లా మీదుగా రాజా సాబ్ బంగ్లా, శ్రీ సాయి నగర్, క్రాంతి నగర్, రాజీవ్‌గాంధీ నగర్, ఆర్‌ఆర్ లేబర్ కాలనీ, కల్లుబా వితో పాటు డణాపురం గ్రామా నికి వేలాదిగా రాకపోకలు సాగిస్తుంటారు. రైలు వెళ్లిపో యాక గేటు తీయగానే పరిస్థితి దారుణంగా ఉంటోందని వాహ నదారులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పాఠశాల, కళాశాలకు వెళ్లే సమయాల్లో గేటు పడితే విద్యార్థులు నరకం అనుభవిం చాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణా నికి ఇప్పటికే నిధులు మంజూరవగా, మంగళవారం సబ్‌కలెక్టర్ పరిశీలించి వెళ్లారు. వంతెన పనులను వెంటనే ప్రారంభించాలని కోతున్నారు.