Share News

ఫ్లోరైడ్‌ నీటితో వ్యాధులు

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:30 AM

ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తిగితే వ్యాధులు వస్తాయని జిల్లా అధికారి డాక్టర్‌ మహేశ్వర్‌ ప్రసాద్‌ అన్నారు. గురువారం సంచార చికిత్సా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఫ్లోరైడ్‌ నీటితో వ్యాధులు
అవగాహన కల్పిస్తున్న మహేశ్వర్‌

వెల్దుర్తి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న నీటిని తిగితే వ్యాధులు వస్తాయని జిల్లా అధికారి డాక్టర్‌ మహేశ్వర్‌ ప్రసాద్‌ అన్నారు. గురువారం సంచార చికిత్సా కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఎంపీపీ పాఠశాలలో ఫ్లోరోసిస్‌ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫ్లోరైడ్‌ నీరు తాగితే దంతాలు పసుపు, గోధుమ రంగులోకి మారతా యని, కిడ్నీ వ్యాధులు, ఎముకలు గ్రుండంగా వంగిపోయి కీళ్లనొ ప్పులు, కండరాల బలహీనత పడడం, ప్రేగు గోడలు దెబ్బతిం టాయన్నారు. ఖనిజాలను గ్రహించకపోవడంతో రక్తహీనత, దప్పిక తీరకపోవడం, పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపు తాయన్నారు. బీడీ, చుట్ట, పాన్‌, పాన్‌మసాలా పయోగించడం ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. మల్టీ విటమిన్‌, జింక్‌, ఐరన్‌, క్యాల్షియం, విట మిన్‌-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. డాక్టర్‌ భువనతేజ, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌, హెచ్‌ఎంలు పద్మావతి, ఆరోగ్య అధికారి ఈశ్వరి, ఆరోగ్య కార్యకర్త మద్దమ్మ, ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:30 AM