Share News

పొలాన్ని తడిపేందుకు అవస్థలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:52 AM

మండలంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు పంటలను కాపాడుకు నేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దేవనకొండ, గద్దెరాళ్ల, కుంకనూరు, ఆలారుదిన్నె, కప్పట్రాళ్ల గ్రామాల రైతులు పంటలను కాపుడుకునేందుకు తిప్పలు పడుతున్నారు.

పొలాన్ని తడిపేందుకు అవస్థలు
కాలువ వద్ద ఆయిల్‌ ఇంజన్‌ ఏర్పాటు చేస్తున్న రైతులు... బోరు వేసిన కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతు ఖాజ ఉశేన్‌.

డీజిల్‌ ఇంజన్‌తో ఎకరాకు రూ.10వేలు ఖర్చు..

హంద్రీనీవాకు పిల్లకాలువలు లేకపోవడమే కారణం

దేవనకొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు పంటలను కాపాడుకు నేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దేవనకొండ, గద్దెరాళ్ల, కుంకనూరు, ఆలారుదిన్నె, కప్పట్రాళ్ల గ్రామాల రైతులు పంటలను కాపుడుకునేందుకు తిప్పలు పడుతున్నారు.

పిల్ల కాలువలు లేక అవస్థలు..

హంద్రీనీవా కాలువలో నీరు పారుతున్నా పిల్ల కాలువలు లేకపోవడంతో నీరందడం లేదు. మండ లంలో 50వేల ఎకరాల్లో పొలాలు ఉన్నాయి. అయితే పిల్ల కాలువలు లేకపోవడంతో నీరందడంలేదు.

ఆయిల్‌ ఇంజన్లతో నీరు..

పంటలను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆశతో రైతులు ఆయిల్‌ ఇంజన్ల ద్వారా నీందిస్తున్నారు. దాదాపు మూడు వారాలకుపైగా వర్షం లేకపోవడంతో భూమి ఎండిపోయి కాలువలోని నీటికి పీల్చేస్తోంది. దీంతో ఉన్న కొద్ది నీటినే వాడుకుంటున్నారు. గంటకు లీటర్‌ డీజిల్‌ ఖర్చు కాగా, ఇంజన్‌ బాడుగ రోజుకు రూ.వెయ్యి, ఒక్కో పైపుకు రూ.10 ప్రకారం చెల్లించాలి. రోజుకు 8 గంటలు పంప్‌ చేసినా, ఎకరాకు మాత్రమే నీరందుతోంది. ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అంత ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఎకరాకు దాదాపు రూ.2వేలు అవుతోంది. అయిదు ఎకరాలు ఉంటే రూ.10వేలు ఖర్చు అవుతోంది. దీతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలి.

పిల్లకాలువలు ఉండింటే ఖర్చు తగ్గేది. ఎకరా పంటను తడిపేందుకు దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుంది. ముడు ఎరకాలకు రూ.30 వేల దాక ఖర్చు వస్తుంది. - మురళి, రైతు, దేవనకొండ.

కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతు ఖాజ ఉశేన్‌. 14 ఎకరాల్లో చీనితోట సాగు చేశాడు. మొక్కలను కాపాడుకునేందుకు నెలన్నర క్రితం జియాలజిస్టుతో సంప్రదించి 780 అడుగుల వరకు బోరు వేయించాడు. అయితే నీరు పటడలేదు. దీంతో తాను ఖర్చు చేసిన రూ.లక్ష మట్టిపాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - Aug 04 , 2025 | 12:52 AM