Share News

దివ్యాంగుల పాట్లు..

ABN , Publish Date - May 09 , 2025 | 12:51 AM

కొత్త పింఛన్‌ మంజూరుకు దివ్యాంగులు మెడికల్‌ బోర్డు నుంచి డిజిటలైజేషన్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించండంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు.

దివ్యాంగుల పాట్లు..
సదరరం క్యాంపులో దివ్యాంగులకు వైద్యపరీక్షలు(ఫైల్‌)

టెక్కలిలో ‘సదరం’ స్లాట్‌ ఇచ్చిన అధికారులు

ఆలూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్‌ మంజూరుకు దివ్యాంగులు మెడికల్‌ బోర్డు నుంచి డిజిటలైజేషన్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించండంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఆలూరుకు చెందిన దివ్యాంగుడు రవి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని జిల్లా కేంద్రంలో కాకుండా సుదూర ప్రాంతంలో ఉన్న టెక్కలి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరంస్లాట్‌ బుక్‌ అయిందని అంత దూరం ఎలా వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జిల్లా అధికారుల స్పందించి డివిజన్‌ లేకుంటే జిల్లా కేంద్రంలోనే సదరం క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నారు.

Updated Date - May 09 , 2025 | 12:51 AM