పాస్ పుస్తకం లేక అవస్థ
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:51 AM
(ఆంధ్రజ్యోతి): పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు
ఆన్‌లైన్‌లో సైట్ ఓపెన్ కావడం లేదు : తహసీల్దార్
మద్దికెర, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోతున్నారు. మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. 22,500 హెక్టార్ల సాగు భూమి, 7,600 మంది రైతులు ఉన్నారు. మండల కేంద్రంలో కెనరా బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, రెండు సహకార సంఘాలు ఉన్నాయి. అయితే పాస్‌బుక్కు లేకపవోడంతో అప్రూవ్ కావడం లేదు. ఆన్‌లైన్‌లో పాసు పుస్తకాలు ఉంటేనే రుణం వస్తుందని సచివాలయ ఉద్యోగులు అంటుండగా, రెవెన్యూ అధికారులు మాత్రం సమాధానం చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. మరో నెలలో ఖరీఫ్ ముగుస్తుందని, రబీ ప్రారంభమయ్యే లోపైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ గుండాల్ నాయక్ మాట్లాడుతూ ఆన్‌లైన్ సర్వర్ పని చేయడం లేదని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రెండు నెలల నుంచి తిరుగుతున్నా
పెద్దల నుంచి వచ్చిన భూమి ఉంది. రెండు నెలల నుంచి తిరుగుతున్నా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. - నరసన్న, రైతు, మద్దికెర