Share News

సున్నిపెంట సీహెచ్‌సీకి డయాలసిస్‌ కేంద్రం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:23 PM

జిల్లాలోని సున్నిపెంట సీహెచ్‌సీకి డయాలసిస్‌ కేంద్రం మంజూరైంది.

సున్నిపెంట సీహెచ్‌సీకి డయాలసిస్‌ కేంద్రం
సున్నిపెంట ఆస్పత్రి

నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సున్నిపెంట సీహెచ్‌సీకి డయాలసిస్‌ కేంద్రం మంజూరైంది. ప్రధానమంత్రి నేషనల్‌ డయాలసిస్‌ ప్రోగ్రాం కింద రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఏడు కేంద్రాల్లో సున్నిపెంట సీహెచ్‌సీ ఒకటి. నిరుపేదలు డయాలసిస్‌ చేయించుకునేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రతి రోజు 15 మందికి చొప్పున రక్తశుద్ధి చేసే అవకాశం కల్పిస్తారు. ఒక్కొక్కటి రూ.75లక్షలు విలువ చేసే మూడు రక్తశుద్ధి యంత్రాలు ఆస్పత్రిలో ఏర్పాటుచేయనున్నారు. శ్రీశైల పరిసర ప్రాంతంలో డయాలసిస్‌ చేయుంచుకునే రోగులకు ఈ కేంద్రం సౌకర్యవ ంతంగా ఉంటుంది. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ లో మాత్రమే ఉచిత డయాలసిన్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం సున్నిపెంటలో ఏర్పాటుచేస్తున్నారు.

కిడ్నీ రోగులకు ఉపయోగకరం

సున్నిపెంటలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుచేయడంతో కిడ్నీ రోగులకు ఉపయోగకరం. . సున్నిపెంటలో 10మంది కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిన్‌ చేయుంచుకుంటున్నారు. ప్రస్తుతం డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో కర్నూలు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా వాసులకు కూడా అందుబాటులో ఉంటుంది.

డాక్టర్‌ లలిత, డీసీహెచ్‌ఎస్‌(డిస్ర్టిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌), నంద్యాల

Updated Date - Oct 21 , 2025 | 11:23 PM