Share News

వైభవంగా ధీరేంద్ర తీర్థుల మహా రథోత్సవం

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:28 AM

మంత్రాలయం రాఘవేం ద్ర స్వామి పూర్వపు పీఠాధిపతి ధీరేంద్ర తీర్థుల మహా రథోత్సవం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ధీరేంద్ర తీర్థుల మహా రథోత్సవం
భక్తులనుద్దేశించి మాట్లాడుతున్న పీఠాధిపతి

మంత్రాలయం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేం ద్ర స్వామి పూర్వపు పీఠాధిపతి ధీరేంద్ర తీర్థుల మహా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం ఉత్తరాధన ఉత్సవాలను ఘనం గా జరుపుకున్నారు. కర్ణాటకలోని హవేరి జిల్లా హొసరుత్తిలో వెలసిన ధీరేంద్ర తీర్థుల బృందావనానికి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవా యిద్యాల లోక కళ్యాణార్థం మాన్యసూక్త హోమాన్ని నిర్వహించి పూర్ణా హుతి చేశారు. బృందావనానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు, వెండి ఆభరణాలతోపాటు, పట్టు వస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారిని పల్లకిలో ఊరేగించిన అనంతరం మహా రథంపై అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం బృందావనానికి హస్తోదకం చేసి పీఠాధిపతి మహా మంగళ హారతి ఇచ్చారు. అక్కడే సంస్థాన పూజలో భాగంగా మూలరాములకు విశేషంగా బంగారు ఆభరణాలతో అభిషేకం చేశారు. వందలాది మంది పాల్గొన్న భక్తులకు పీఠాధిపతి శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎస్‌ఎన వెంకటేష్‌ ఆచార్‌, వాజేంద్ర ఆచార్‌, సూరీంద్ర ఆచార్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ఆచార్‌, పవన ఆచర్‌, విజయేంద్రాచార్‌, ఆనంద తీర్థ ఆచర్‌, గౌతమ్‌ ఆచార్‌, గోపాలకృష్ణస్వామి, వరధేంద్రాచార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:28 AM