Share News

రాఘవేంద్రుని సన్నిధిలో జైళ్ల డీజీ అంజనీ కుమార్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:15 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం రాష్ట్ర జైళ్ల డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అంజనీ కుమార్‌ మంగళవారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

రాఘవేంద్రుని సన్నిధిలో జైళ్ల డీజీ అంజనీ కుమార్‌
మంత్రాలయంలో ప్రదిక్షణలు చేస్తున్న రాష్ట్ర జైళ్ల డీజీ అంజనీ కుమార్‌

మంత్రాలయం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం రాష్ట్ర జైళ్ల డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ అంజనీ కుమార్‌ మంగళవారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈయనకు మహాముఖ ద్వారం వద్ద మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌ కోణాపూర్‌, మంత్రాలయం సీఐ రామాంజులు, కర్నూలు జిల్లా జైళ్ల సూపరింటెండెంట్‌ నరసింహారెడ్డి, ఆదోని జైలర్‌ నజీర్‌ అహ్మద్‌, అనంతస్వామి, పవన్‌ ఆచార్‌, వ్యాసరాజార్‌, జయతీర్థ ఆచార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:15 AM