Share News

నదితీర ప్రాంతాల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:51 PM

కార్తీక మాసం సందర్భంగా ఆలయాలు, నదితీర ప్రాంతాల వద్ద రద్దీ అధికంగా ఉంటుదని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు.

నదితీర ప్రాంతాల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా ఆలయాలు, నదితీర ప్రాంతాల వద్ద రద్దీ అధికంగా ఉంటుదని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు. శైవ క్షేత్రాలు, నదితీరాల్లో వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ పలు పోలీస్‌ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కార్తీక పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులు తమ వెంట చిన్న పిల్లలను తీసుకెళ్లకూడదన్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలు దేవాలయాల్లో దీపాలు వెలిగించి.. అలాగే కార్తీక దీపాలను నదులలో, కేసీ కెనాల్‌లలో వదిలే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్లు కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయం, బహ్మగుండేశ్వరస్వామి శివాలయం, నందవరంలో గురజాల గ్రామ శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. వీటితో పాటు రద్దీ ఉన్న ఆలయాలను గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:51 PM