వీఐపీ దర్శనాలపై భక్తుల అసహనం
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:18 PM
శ్రీశైల మల్లన్న సన్నిధిలో వీఐపీ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బం దులు కలిగి సహనం కోల్పోయి దేవస్థానం అధికారులు సిబ్బం దితో వాగ్వివాదానికి దిగారు.
శ్రీశైలం దేవస్థానం సిబ్బందితో వాగ్వాదానికి దిగిన శివ స్వాములు
శ్రీశైలం, డిసెంబరు 01 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల మల్లన్న సన్నిధిలో వీఐపీ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బం దులు కలిగి సహనం కోల్పోయి దేవస్థానం అధికారులు సిబ్బం దితో వాగ్వివాదానికి దిగారు. తెల్లవారుజాము నుండి క్యూలైన్లలో ఉండే తమను అడ్డగించి వీఐపీలు దర్శనాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం ఉదయం ధ్వజస్తంభం నుండి నంది మండపం వరకు గల భక్తులు ఆందోళన చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అలంకార దర్శనం సమయంలో వస్తున్న ప్రముఖుల కోసం గంటల తరబడి సామాన్య భక్తులను, శివస్వాములను ఇబ్బందులకు గురిచేసున్నారని ఆలయ సిబ్బందిపై మండిప డ్డారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక నియమావళి రూపొంది స్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.