ఉరుకుంద క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:29 PM
అమావాస్య సందర్భంగా ఉరుకుంద క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి ఆలయంలో స్వామి వారికి అమావాస్య సందర్భంగా లక్ష పుష్పార్చన సేవలు కొనసాగించారు.
కౌతాళం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అమావాస్య సందర్భంగా ఉరుకుంద క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి ఆలయంలో స్వామి వారికి అమావాస్య సందర్భంగా లక్ష పుష్పార్చన సేవలు కొనసాగించారు. కసాపురం ఆంజనేయస్వామి ఆలయ ఈవో విజయరాజు పాల్గొని స్వామి వారికి పుష్పార్చన నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌కు వెండి, ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయ అధికారులు భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. కొందరు భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకోగా మరి కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వంటకాలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు. అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.