ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:01 AM
జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాసపు ఉత్స వాల్లో భాగంగా రెండో సోమ వారం స్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ క్షేత్రం భక్తజనసంద్రంగా మారిం ది.
కౌతాళం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాసపు ఉత్స వాల్లో భాగంగా రెండో సోమ వారం స్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ క్షేత్రం భక్తజనసంద్రంగా మారిం ది. భక్తులు ఆదివారం రాత్రి నుంచే దర్శించుకునేం దుకు బారులుదీరారు. రాత్రి విరామం లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చ కులు స్వామి వారి మూలవిరాట్‌కు వెండి అలంకరణ చేపట్టి భక్తులకు దర్శనం కల్పించారు. ఎల్ ఎల్‌సీ కాలువలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వాహనాల రద్దీతో అన్ని రూట్లలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.