శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:03 AM
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి పోటెత్తారు. శనివారం స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర వీఽధులు సందడిగా మారాయి.
శ్రీశైలం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి పోటెత్తారు. శనివారం స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర వీఽధులు సందడిగా మారాయి. తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు మొక్కులుగా సమర్పించిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. ఉభయ దేవాలయాలతో పాటు పరివార ఆలయాలు దర్శించుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. దేవస్థానం నిర్వహించే ఆర్జిత సేవలలో హోమాలు, కల్యాణాలు యథావిధిగా సాగాయి.