Share News

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:25 PM

శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భక్తులు తరలివచ్చారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు

యథావిధిగా ఆర్జిత సేవలు

శ్రీశైలం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భక్తులు తరలివచ్చారు. యాత్రికులు గదులు పొందటానికి ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం నిర్వహించే వసతి గదులను ముందుగా ఆన్‌లైన్‌, సిఫారసు లేఖల ద్వారా బుకింగ్‌ చేసుకున్న వారికి కూడా గదులు లభించకపోవడంపై పలువురు అసంతృపత్తి వ్యక్తం చేశా రు. వారాంతపు రోజుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులందరికీ స్వామి అమ్మ వార్ల అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో జరిగే ఆర్జితసేవలు, హోమా లు, కల్యాణాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. కార్తీక మాసం సాయంత్రం వేళలో శాస్త్రోక్త పూజలు జరిపించి ధ్వజస్తంభంపై ఆకాశదీపాన్ని వెలిగించారు. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన వేదికపై హైదరాబాద్‌కు చెందిన పద్మజ సాంప్రదాయ నృత్య బృం దం పలు భక్తిగీతాలకు చేసిన నృత్యాలు యాత్రికులను అలరించాయి.

Updated Date - Nov 08 , 2025 | 11:25 PM