శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:46 PM
వరుసగా మూడు రోజుల సెలవు రావడంతో శనివారం శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.
పాతాళగంగలో పుణ్యస్నానాలు
నంద్యాల కల్చరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): వరుసగా మూడు రోజుల సెలవు రావడంతో శనివారం శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్ధం భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ గా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆతర్వాత స్వామి అమ్మవార్లను దర్శికుంచున్నారు. శివనామ స్మరణతో ఆలయపరిసరాలు మార్మోగాయి. భక్తులకు దేవస్దానం అధికారులు మంచినీరు, అన్నప్రసాద వితరణ గావించారు.