మహానందికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:36 PM
మహా నంది శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వివిధ వాహనాల ద్వారా శనివారం రాత్రే క్షేత్రానికి వచ్చారు.
మహానంది, డిసెంబరు 28 (ఆంరఽధజ్యోతి): మహా నంది శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వివిధ వాహనాల ద్వారా శనివారం రాత్రే క్షేత్రానికి వచ్చారు. వేకువజాముననే ఆలయంలోని కోనేర్లల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం ఇచ్చే మహా మంగళ హారతి సేవలో పాల్గొనేందుకు క్యూలో నిల్చున్నారు.