కొలనుభారతికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:27 PM
కొలనుభారతి పుణ్య క్షేత్రంలో సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు ద ర్శనమిచ్చారు.
210 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం
కొత్తపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొలనుభారతి పుణ్య క్షేత్రంలో సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు ద ర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు ఛారుగోషిణి నదిజలాలతో అ మ్మవారిని అభిషేకించారు. 210మంది చిన్నారులకు అక్షర బీజాక్షర క్రతు వులు నిర్వహించారు. రాష్ట్రంలోని ఏకైక సరస్వతి అమ్మవారి క్షేత్రమైనప్పటికీ ఒక దేవస్థానం అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది ప డ్డారు. పురోహితులు తూతూ మంత్రంగా పూజలు చేసి మమ అనిపించే శారు. భక్తుల ఇబ్బందులను ఈవో రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తాను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విధుల్లో ఉన్నట్లు తెలిపారు.